Friday, November 28, 2025
E-PAPER
Homeజిల్లాలుమహోన్నత వ్యక్తి జ్యోతి రావు పూలే

మహోన్నత వ్యక్తి జ్యోతి రావు పూలే

- Advertisement -

  • – కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య
  • – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే రేన్ రెడ్డి

నవతెలంగాణ తలకొండపల్లి: బడుగు బలహీన వర్గాలకు  అక్షర కాంతిని  దారి చూపిన, ప్రపంచానికి  చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి జ్యోతి రావు పూలే అని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలోని కెవిపిఎస్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే  135వ వర్ధంతి  ఘన చిత్రపటానికి  స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య మాట్లాడుతూ జ్యోతిరావు పూలే దంపతుల కారణంగానే అణగారిన వర్గాలు అక్షరాల వైపు కదిలారని, ప్రభుత్వం కూడా ఈ చైతన్యంతోనే ప్రభుత్వ పాఠశాలలను స్థాపించిందని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.

135 ఏండ్ల క్రితం మృతిచెందిన మహాత్మ జ్యోతిరావు పూలే మన అందరికీ ఆదర్శమైన నాయకుడు, బాల బాలికలకు విద్య ఉండాలని మూఢవిశ్వాసాల పై కుల వివక్షత పై పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు. భార్య సావిత్రిబాయి కి విద్యను అందించి మహిళ ను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన గొప్ప సామాజిక నాయకులు, సమాజం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు  మనమందరం జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే రేన్ రెడ్డి, డేవిడ్, అంజయ్య, దైవానందం కెవిపిఎస్ మండల ఉపాధ్యక్షులు, కెవిపిఎస్ గ్రామ మాజీ అధ్యక్షులు కొమ్మ చెన్నయ్య, సాయిలు, సిఐటియు నాయకులు పి నరసింహ, రాములు, రామచందర్, చంద్రయ్య, గోవింద్,  కృష్ణయ్య,  మచ్చేందర్, శ్రీకాంత్, సాయిలు,  వెంకటయ్య,  విజేందర్, జగన్, నరసింహ, రాములు, గ్రామ పెద్దలు  యువకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -