అపోలో  కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ వేడుకలు

నవ తెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
హుస్నాబాద్ పట్టణంలోని  అపోలో వోకేషనల్ జూనియర్ కళాశాలలో  సోమవారం ఫ్రెషర్స్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ  ఆకట్టుకున్నాయి. కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులకు క్యాష్ బహుమతిగా పాటు మేమొంటోలను , ఫ్రెషర్స్ పార్టీని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతుల ను ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్  వేముల గణేష్  ,కళాశాల డైరెక్టర్ వేముల అంజయ్య, గిరిజన జిల్లా నాయకులు నునవత్ మోహన్ నాయక్, జిల్లా విద్యార్థి సంఘం నాయకులు జెరిపోతుల జనార్దన్, దాసరి ప్రశాంత్, ఆధ్యాపక బృందం మమత, ప్రవీణ్, ప్రసాద్, సుజాత, అఖిల, ఆధ్యాపకేతర బృందం శేఖర్, అరుణలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love