Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంచాదర్‌ఘాట్‌లో భారీ చోరీ

చాదర్‌ఘాట్‌లో భారీ చోరీ

- Advertisement -


– 67 తులాల బంగారం, నగదు అపహరణ
నవతెలంగాణ-మలక్‌పేట్‌

హైదరాబాద్‌లోని ఆజంపుర చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో వృద్ధులు మాత్రమే ఉండటాన్ని గమనించిన దుండగులు.. లోపలికి చొరబడి 67 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ పక్కనే నివాసం ఉంటున్న మహమ్మద్‌ పైముద్దీన్‌ తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్ర వారం రాత్రి ఆయన వృద్ధ తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధులు ఉన్న గదికి బయటి నుంచి గడియ పెట్టారు. ఫ్రిజ్‌లో ఉన్న పండ్లు తిన్నారు. ఆ తర్వాత బీరువాలో ఉన్న 67 తులాల బంగారం, వెండి, రూ2.50 లక్షలు, సామ్‌సంగ్‌ ఎస్‌-9 మొబైల్‌ ఫోన్‌, రాడోవాచ్‌, వీడియో కెమెరా ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటికొచ్చిన పైముద్దీన్‌ చోరీ జరిగినట్టు గుర్తించి చాదర్‌ఘాట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి.. వేలిముద్ర నిపుణులను, డాగ్‌ స్వ్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందు కు ఆరు బృందాల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్టు ఎస్‌హెచ్‌ఓ బ్రహ్మ మురారి తెలిపారు. ఈ కేసును మలక్‌పేట్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, సౌత్‌ ఈస్ట్‌జోన్‌ అదనపు డీసీ వి.రఘు ఆధ్వర్యంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌గౌడ్‌ దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -