నవతెలంగాణ-హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంపై కాంగ్రెస్ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా మండిపడ్డారు. ‘నేషనల్ హెరాల్డ్ కేసు కాదు, ‘నేషనల్ వేధింపుల కేసు’ అని అభిషేక్ మను సింఘ్వీ అభివర్ణించారు.
“ఇక్కడ నేరం లేదు, నగదు లేదు, ఆనవాళ్లు లేవు. అయినప్పటికీ బీజేపీ తన వక్రీకృత మనస్సుతో ఈ కేసును సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, “న్యాయం అంధమైతే, ఈడీ వర్ణాంధత్వం కలిగి ఉంది. ఎటువంటి డబ్బు లేదా స్థిరాస్తి లావాదేవీలు లేకపోయినా, దుర్వినియోగం జరగకపోయినా, ఈడీ తన ఊహల్లో మనీలాండరింగ్‌ను చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.



