Sunday, May 18, 2025
Homeజాతీయంప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

- Advertisement -

– పారదర్శకంగా వ్యవహరించాలి
– పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని తిరస్కరించడం సహేతుకం కాదు : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ:
పహల్గాం ఉగ్ర దాడిని, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలను చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి, ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం దురదృష్టకరమని సీపీఐ(ఎం)పేర్కొంది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దేశ ప్రజలకు వివరాలు తెలియజేయాలని, ఒకవేళ ఎవరన్నా వివరణలు కోరాలనుకుంటే అందుకు అవకాశం కూడా కల్పించాలని ఈ ప్రకటనలో సీపీఐ(ఎం) కేంద్రాన్ని కోరింది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా, కేవలం బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, వారికి ఆపరేషన్‌ సిందూర్‌ గురించి తెలియజేశారని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాల్లో ఇది వివక్షను ప్రదర్శించడమేనని తెలిపింది. ఇటువంటి వివరాలను తెలియజేయడానికి ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రు లు సహా అందరు ముఖ్యమంత్రులనూ సమావేశానికి పిలవాలని డిమాండ్‌ చేసింది. ‘ప్రభుత్వం ముందుగా దేశ ప్రజలకు జవాబుదారీగా వుండాలి, ఆ తర్వాత తన చర్యల్లో పారదర్శకంగా వ్యవహరించాలి’ అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. మతతత్వాన్ని రెచ్చగొట్టే చర్యలను పాలకపార్టీ నేతలు, రాష్ట్రాల మంత్రులు తక్షణమే ఆపాలని కోరింది.
అభ్యంతరాలున్నప్పటికీ… బాధ్యతగా
దౌత్య స్థాయిలో ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివిధ దేశాలకు వివరించడానికి వేర్వేరు దేశాలకు వివిధ ప్రతినిధి బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ విషయం రాజ్యసభలో సీపీఐ(ఎం) పక్ష నాయకుడిని పిలిచి తెలియజేసిందని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది. పైన పేర్కొ న్న అభ్యంతరాలు తమకు వున్నప్పటికీ, తమ డిమాం డ్లు గురించి పునరుద్ఘాటించినప్పటికీ, జాతి ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి ప్రతినిధి బృందాల్లో భాగం కావడం తమ బాధ్యతగా భావించా మని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -