– ఇప్పటివరకూ అదుపులోకి ఏడుగురు అక్రమార్కులు
– డీఆర్‌డీఏ ఫీల్డ్ విజిట్లతో బయటపడ్డ కుంభకోణం
దాహోద్: దేశానికే గుజరాత్ రాష్ట్రం మోడల్ అంటూ ప్రధాని మోడీ స్వరాష్ట్రం గురించి చెప్పుకుంటుంటారు. మేడిపం డులా కనిపించే గుజరాత్ సునిశితంగా పరిశీలిస్తే.. అక్కడ జరిగే అక్రమాలు, అవినీతి, నకిలీనోట్లు ఇలా మరెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన వ్యవసాయ, పంచాయతీ శాఖల మంత్రి కుమారుడే అడ్డంగా అందిన కాడికి దోచుకున్న కేసులో అరెస్టయిన ఉదంతం బీజేపీ పాలిత గుజరాత్‌లో చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల్లో రూ.71కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో గుజరాత్ మంత్రి బచ్బూభారు కుమారుడు బల్వంత్ ఖాబాద్‌తోపాటు దాహోద్ జిల్లాలో పనిచేసిన అప్పటి తాలూకా అభివృద్ధి అధికారి (టీడీఓ) దర్శన్‌పటేల్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకూ ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు.
డీఆర్‌డీఏ ఫీల్డ్ విజిట్లతో బయటపడ్డ కుంభకోణం
దాహోద్ జిల్లాలోని రెండు తాలూకాల్లో కాంట్రాక్టర్లు రోడ్లు, చెక్ వాల్స్ తదితరాలు నిర్మించనప్పటికీ నిర్మించినట్లు కాగితాలపై చూపించి, రూ.71 కోట్ల నిధులు స్వాహా చేసినట్లు డీఆర్‌డీఏ ఫీల్డ్ విజిట్ల సమయంలో వెలుగుచూసింది. టెండర్లలో పాల్గొనని ఏజెన్సీలకు కూడా చెల్లింపులు జరిగాయని విచారణలో తేలింది. 2021 నుంచి 2024 వరకూ 35 ఏజెన్సీల యజమానులు, ప్రభుత్వ అధికారులు కలిసి ఈ నిధులు స్వాహా చేశారు. పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు తప్పుడు సర్టిఫికెట్లు, ఆధారాలను సమర్పించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. ఒక ఏజెన్సీ నిర్వహించిన మంత్రి కుమారుడు బలవంత్ ఖాబాద్ దేవఘడ్ బరియా, ధన్పూర్ తాలూకాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్టు డీఎస్పీ జయదీష్‌సింV్‌ా భండారి తెలిపారు. ఇంతకుముందు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, తాజాగా మంత్రి కుమారుడిని, అప్పటి టీడీఓ దర్శన్ పటేల్‌ను అరెస్టు చేశామని చెప్పారు. దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు డీఎస్పీ వివరించారు.
ఉపాధి స్కాంలో గుజరాత్ మంత్రి కుమారుడి అరెస్టు
- Advertisement -
- Advertisement -