- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గద్వాల ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తినడంతో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



