Tuesday, December 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅడియాల జైలు ప‌రిస‌రాల్లో 144 సెక్ష‌న్

అడియాల జైలు ప‌రిస‌రాల్లో 144 సెక్ష‌న్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: పాక్‌లోని అడియాల జైలు ప‌రిస‌ర ప్రాంతాల్లో పాక్ ప్ర‌భుత్వం 144 సెక్ష‌న్ విధించింది. ఆదేశ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుద‌ల చేయలంటూ ప‌లు రోజుల‌నుంచి అడియాల జైలు ఎదుట‌ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ శ్రేణులు ఆందోళ‌న ఉధృతం చేస్తున్నాయి. త‌మ నాయ‌కుడి ఆరోగ్య వివ‌రాలు వెల్ల‌డించాలని, సంప్ర‌దింపుల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌ల ఇమ్రాన్ ఖాన్ సోద‌రీమ‌ణులు అడియాల జైలు వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌ను క‌లువ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈక్ర‌మంలోని జైలు సిబ్బంది వారితో అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న పీటీఐ కార్య‌క‌ర్త‌లు పెద్ద‌యోత్తున అడియాల జైలు వ‌ద్ద‌కు భారీగా చేరుకున్నారు. పాక్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాద‌లు చేస్తూ బైటాయించారు. దీంతో స్పందించిన పాక్ ప్ర‌భుత్వం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆయ‌న మృతి ప‌ట్ల వ‌స్తున్న వార్తలు అవాస్త‌వమ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. స‌ర్కార్ ప్ర‌క‌ట‌న‌పై న‌మ్మ‌కంలేని పీటీఐ శ్రేణులు అడియాల జైలు వద్ద నిర‌స‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఎలాంటి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని, 144 సెక్ష‌న్ విధిస్తున్నట్లు ప్ర‌క‌టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -