- Advertisement -
నవతెలంగాణ – రాయ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ బవుమా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేశారు. బవుమా, కేశవ్, ఎంగిడి జట్టుతో కలిశారు. భారత జట్టులో మాత్రం మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే ఇండియా బరిలోకి దిగుతున్నది. రాంచీలో జరిగిన ఫస్ట్ వన్డేలో ఇండియా 17 రన్స్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



