Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో భారీగా శ్వాస‌కోశ వ్యాధుల‌ న‌మోదు

ఢిల్లీలో భారీగా శ్వాస‌కోశ వ్యాధుల‌ న‌మోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వాయు కాలుష్యంతో ఢిల్లీలో మూడేళ్లలో 2లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల కేసులు నమోదైనట్లు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. 2022-2024 మధ్య ఢిల్లీలోని ఆరు ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాల్లో 2,04,758 తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్య (ఎఆర్‌ఐ) కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబసంక్షేమ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపింది. వీటిలో 30,420 మంది రోగులు సుమారు 15శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇది ఢిల్లీలో దీర్ఘకాలిక వాయు కాలుష్య సంక్షోభంతో తీవ్రమైన ఆరోగ్య నష్టాన్ని వెల్లడిస్తోంది.

2022: 67,054 అత్యవసర కేసులు ప 9,874 అడ్మిషన్లు
2023: 69,293 అత్యవసర కేసులు ప 9,727 అడ్మిషన్లు
2024: 68,411 అత్యవసర కేసులు ప 10,819 అడ్మిషన్లు
2024లో మొత్తం అత్యవసర సందర్శనలలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, అడ్మిషన్‌ అవసరమైన రోగుల సంఖ్య బాగా పెరిగింది, ఇది ఆసుపత్రులకు వచ్చే కేసులు మరింత తీవ్రంగా మారుతున్నాయని సూచిస్తోందని కేంద్రం తెలిపింది. వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు మరియు సంబంధిత వ్యాధులను కలిగించే కారకాల్లో ఒకటి అని ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఆహారం, వృత్తి, సామాజిక ఆర్థిక స్థితి మరియు ముందుగా ఉన్న పరిస్థితులతో సహా బహుళ కారకాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని స్పష్టం చేసింది.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) పలు నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో కాలుష్య స్థాయిలలో పెరుగుదల శ్వాసకోశ వ్యాధులతో అత్యవసర విభాగాల్లో చేరే వారిసంఖ్య పెరుగుదలతో నేరుగా ముడిపడి ఉందని తేలింది. 33,000 కంటే ఎక్కువ మంది రోగులలో, క్షీణిస్తున్న గాలి నాణ్యత మరియు శ్వాసకోశ అనారోగ్యం మధ్య స్పష్టమైన సంబంధం ఉన్నట్లు నివేదిక తెలిపింది. అయితే, అధ్యయనం ప్రత్యక్ష కారణాన్ని నిరూపించలేకపోయింది.
అలాగే, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సిడిసి) ఆగస్టు 2023 నుండి ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌ (ఐహెచ్‌సి) ద్వారా వాయు కాలుష్య సంబంధిత వ్యాధుల డిజిటల్‌ నిఘాను చేపడుతోంది. ఢిల్లీలోని ఆరు ప్రాంతాలతో సహా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 230 కంటే ఎక్కువ సెంటినెల్‌ సైట్‌లను కవర్‌ చేసినట్లు తెలిపింది.

రాజ్యసభ ఎంపి డాక్టర్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ సాహ్ని (నామినేట్‌ సభ్యులు) లేవనెత్తిన ప్రశ్న నెం-274కి కేంద్రమంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం మరియు శ్వాసకోశ వ్యాధుల మధ్య సంబంధాన్ని కేంద్రం అధ్యయనం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే 2022-25 మధ్య మెట్రో నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో నిమోనియా, సిఒపిడి మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కారణంగా అవుట్‌ పేషెంట్‌ మరియు ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య , ఇతర వివరాలను వెల్లడించాల్సిందిగా ఎంపి డాక్టర్‌ విక్రమ్‌ జిత్‌ సింగ్‌ సాహ్ని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -