Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంయూనివర్సిటీల‌కు బాంబు బెదిరింపు

యూనివర్సిటీల‌కు బాంబు బెదిరింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశ రాజధాని ఢిల్లీ లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని రెండు కళాశాలలకు బుధవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రెండు కళాశాలలకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నార్త్‌ క్యాంపస్‌లోని రాంజాస్‌ కళాశాల, కల్కాజీలోని దేశ్‌బంధు కళాశాలకు ఈ మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపి సోదాలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -