- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యాద్రాది భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిమ్మల సురేష్ ముదిరాజ్(BSP) నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను బుధవారం ఎన్నికల అధికారులకు అందజేశారు. అంతకుముందు గ్రామంలోని బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. బహుజనుల అభివృద్ధి కోసం, గ్రామాభివృద్ధికి కోసం సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని, యువతీయువకులు, గ్రామస్తులంతా తనకు మద్దతుగా నిలవాలని, ఓటు వేసి తనను గెలిపించాలని బీఎస్పీ సర్పంచ్ అభ్యర్థి నిమ్మల సురేష్ కోరారు.

- Advertisement -



