నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమాన సేవల్లో అవరోధం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సాంకేతిక సమస్యలతో ఇండిగో సర్వీసులు రద్దు చేశారు. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 13 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
సాంకేతిక లోపాలు, రద్దీ, ఆపరేషనల్ సమస్యలు, సిబ్బంది కొరత కారణమని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం పరిస్థితి నెలకొంది. చెక్ ఇన్ సిస్టమ్ లో సాంకేతిక లోపంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్టుల్లో ఐటీ సర్వీసులు, చెక్ ఇన్ సిస్టమ్స్ పనిచేయకపోవడంతో చెక్‌ఇన్, బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.



