నవతెలంగాణ హైదరాబాద్: స్వదేశీ ఆండ్రాయిడ్ యాప్ మార్కెట్ ప్లేస్ అయిన ఇండస్ యాప్‌స్టోర్, మోటోరోలాతో పార్ట్‌నర్‌షిప్‌ను కుదుర్చుకుందని ఈరోజు ప్రకటించింది. భారతదేశంలో విడుదలయ్యే మోటోరోలా పరికరాల్లో ఇండస్ యాప్‌స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పార్ట్‌నర్‌షిప్ వీలు కల్పిస్తుంది. ఇది ఇండస్ యాప్‌స్టోర్ విస్తృత పంపిణీకి అవకాశాన్ని కల్పిస్తుంది, అలానే భారతదేశంలోని మోటోరోలా యూజర్లకు తమ అవసరాలకు తగిన యాప్‌లను వెతుక్కోగలిగే అనుభవాన్ని అందిస్తుంది.
ఇండస్ యాప్‌స్టోర్ అనేది యాప్ ఎకోసిస్టమ్‌లో ఉపయోగకరమైన ప్రత్యామ్నాయాన్ని భారతీయ యూజర్లకు అందిస్తోంది, ఇది ప్రత్యేకంగా యూజర్ ప్రాధాన్యత, ఇంకా దేశంలోని వైవిధ్యమైన సాంస్కృతిక సమ్మేళనాల కేంద్రంగా రూపొందింది. ఈ ప్లాట్‌ఫామ్ 12 భారతీయ భాషలు అలానే ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటూ, సంక్లిష్టమైన స్థానిక భాషలను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, AIతో పనిచేసే వాయిస్ సెర్చ్ ఆప్షన్‌తో యూజర్లకు సొంత భాషలోనే అనుభవాన్ని అందిస్తూ, ప్రతి భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు చేరువ కావడానికి కట్టుబడి ఉంది. వీటికి తోడు, వీడియో ప్రివ్యూ ఫీచర్‌ను ఉపయోగించి, ఏదైనా యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ యాప్ ఎలా పని చేస్తుందో వీడియోలోనే చూసి తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్ తన న్యాయమైన యాప్ స్టోర్ పాలసీలతో భారతదేశంలోని డెవలపర్లు, యాప్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇది ఒకే పంపిణీ వనరుపై ఆధారపడటాన్ని తగ్గించి, ఆచరణీయమైన, పోటీతత్వ ప్రత్యామ్నాయానికి మార్గాన్ని సుగమం చేసింది. ఇది క్రమంగా పెరుగుతున్న స్థానిక డెవలపర్లకు సాధికారతను, అవకాశాలను కల్పిస్తుంది, అలానే భారతీయ డెవలపర్ ఎకోసిస్టమ్ ప్రపంచ స్థాయిలో విజయం సాధించేందుకు ప్రోత్సాహకంగా నిలుస్తుంది.
ఈ కీలక మైలురాయిపై ఇండస్ యాప్‌స్టోర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రియా ఎమ్ నరసింహన్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, “ఇండస్ యాప్‌స్టోర్ అనుభవాన్ని విస్తృత శ్రేణి భారతీయులు సజావుగా యాక్సెస్ చేసేలా వీలు కల్పించడం, అలానే భారతీయ మార్కెట్ మొత్తానికీ మా సర్వీస్‌లను అందించాలనే మా నిబద్ధతను బలోపేతం చేయడంలో భాగంగా మోటోరోలాతో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఇది మేడ్-ఫర్-ఇండియా స్ఫూర్తిని వాస్తవంగా ప్రతిబింబించే యాప్ స్టోర్, ఇది భారతీయ యాప్ ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చే కీలక మలుపుపై దృష్టి నిలిపింది. ఈ పార్ట్‌నర్‌షిప్ భారతీయులకు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, వారి ప్రాంతానికి తగిన యాప్‌లను వెతికి కనుక్కునేందుకు ఉపయోగకరమైన, ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలనే మా ప్రయత్నాన్ని పటిష్టం చేస్తుంది” అని అన్నారు.
ఈ సందర్భంగా, మోటోరోలా మొబిలిటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎమ్. నరసింహన్ తన ఉత్సాహాన్ని వెల్లడిస్తూ, “మోటోరోలాలో విధులు నిర్వహించే మేమంతా, భారతదేశంలోని మా యూజర్లకు విలువైన, స్థానికంగా సంబంధితమైన అనుభవాన్ని అందించడానికే ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తాము, మా విజన్‌కు ఇండస్ యాప్‌స్టోర్ సరిగ్గా సరిపోతుంది. ఈ స్వదేశీ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించడం వల్ల, సాంస్కృతికంగా సంబంధితమైన మా యూజర్ల అనుభవాన్ని సుసంపన్నం చేసేటటువంటి వినూత్నమైన యాప్‌ను వెతికి కనుక్కునే మాధ్యమాన్ని మేము అందిస్తున్నాము. ఇండస్ యాప్‌స్టోర్‌కు ఉన్న ప్రత్యేకమైన పంపిణీ మోడల్ ద్వారా భారతీయ డెవలపర్లను తగిన యూజర్లతో కనెక్ట్ చేసి, వారికి సహకరించే అదనపు ప్రయోజనాన్ని ఈ పార్ట్‌నర్‌షిప్ అందిస్తుంది” అని చెప్పారు.



