Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్చేతిపంపును మరమత్తులు చేయాలి..

చేతిపంపును మరమత్తులు చేయాలి..

- Advertisement -

– గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గ చిరంజీవి 
– పట్టించుకోని అధికార యంత్రాంగం 
నవతెలంగాణ -తాడ్వాయి 
: మండలంలోని భూపతిపూర్ ఆదివాసి గ్రామంలో గత రెండు సంవత్సరాల నుండి కరాబైన చేతి పెంపును అధికారులు పట్టించుకోవడంలేదని, వెంటనే మరమ్మత్తులు చేయాలని గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి డిమాండ్ చేశారు. ఆదివారం భూపతిపూర్ గ్రామాలను సందర్శించి అక్కడి ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూపతిపూర్ ను ఎప్పటినుండో త్రాగునీటి సమస్య వెంటాడుతుందని ఆయన ఆవేదన చెందారు. చేతిపంపులు నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ఆదివాసి ప్రజల దాహం తీరకపోగా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. పంచాయితీ పాలకులు తాగునీటి వనరుల బాగోవులు చూసుకోవాల్సి ఉన్న నిధులలేమిటో దృష్టి సారించడం లేదు. చేతి పంపులు ఏళ్ల తరబడి మరమతులకు నోచుకోకపోవడంతో తాగునీటికి ఆదివాసి గిరిజనులు తంటాలు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. భూపతిపురంలో అధికారుల నిర్లక్ష్యంతో లక్షలు వెచ్చించి చేసిన బోర్లు వృధాగా మారాయి అన్నారు. స్థానిక మంత్రి సీతక్క మండలంలోని బోరు పంపుల పైన చొరవ తీసుకొని అన్ని బోరు పంపు (హ్యాండ్ పంపు) మరమ్మతులయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూపతిపూర్ ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు. లేకుంటే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనల పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతిపూర్ గ్రామస్తులు బడే రాజు, ఎట్టి నాగయ్య, సుర్బాక వెంకటేశ్వర్లు, బడే కాంత, ఎట్టి శ్రీదేవి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -