నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ మరోసారి భారత్ చర్యలను కాపి కొట్టింది. పహల్గాం ఉగ్రదాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని..యుద్దానికి దారి తీసిన విషయం తెలిసిందే. మే7 ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ భారత్ ఎటాక్ చేసింది. నాలుగురోజుల తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్దానికి తెరపడింది. అయితే ఉగ్రవాదానికి మద్దతుగా పాక్ నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి ప్రపంచవేదికలపై ఎండగట్టానికి భారత్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దేశంపై దౌత్య యుద్ధానికి పలు పార్టీల ఎంపీలతో కూడిన ఏడుగురు సభ్యుల బృందాలను భారత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈనెల ఆఖర నుంచి వివిధ దేశాలకు ఎంపీల బృందం వెళ్లనుంది. తాజాగా షరిఫ్ ప్రభుత్వం కూడా భారత్ చర్యలను కాఫి కొట్టింది. ఆదేశం కూడా ప్రపంచ శాంతి-పాక్ తోడ్పాటు అనే పేరుతో ప్రపంచ యాత్రకు సిద్ధమైంది. అందుకు ఎంపీల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బృందానికి పాకిస్థాన్ పీపుల్ పార్టీ చైర్మెన్ బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహించినున్నట్లు ఆదేశ ప్రధాని ప్రకటించారు.
భారత్‌ను కాపీ కొట్టిన షరిప్ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -