నవతెలంగాణ-హైదరాబాద్:
నవతెలంగాణ-హైదరాబాద్: ఎంపీ శశి థరూర్ పై భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) కార్యదర్శి బినోయ్ విశ్వం సెటైర్లు వేశారు. బీజేపీ స్లీపింగ్ సెల్‌లో థరూర్ తన బెర్తు కోసం వెతుకుతున్నట్లు అనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి వారిని ఎలా ఉపయోగించుకోవాలో బీజేపీకి తెలుసు , వారికి ఉగ్రవాదంపై పోరాటం కూడా పార్టీ లాభాల కోసం వేటాడే పని అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బినోయ్ విశ్వం ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం తమ తమ పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాలని కోరింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీల పేర్లతో కూడిన ఓ జాబితాను కేంద్రానికి సమర్పించింది. ఇందులో ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పేరు లేనేలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నుంచి శశిథరూర్ ను ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా ప్రతినిధి బృందానికి ఆయననే నాయకుడిగా చేసింది. ఆయన నాయకత్వంలోని ఎంపీల బృందం ఆమెరికాకు వెళ్లనుంది.
ఎంపీ శశి థరూర్ పై CPI కార్యదర్శి సెటైర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES