నవతెలంగాణ-హైదరాబాద్: ఐపిఎల్ 2025లో భాగంగా … ఆదివారం 59 వ మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. హెడ్ టు హెడ్ మ్యాచ్‌లలో రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 17 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌లలో గెలిచింది. జైపూర్ వేదికగా ఈ రెండు జట్లు 6 మ్యాచ్‌లు ఆడితే రాజస్థాన్ ఐదు, పంజాబ్ ఒక్క మ్యాచ్‌లో నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ ఐపిఎల్ ఫ్యాన్స్ ఫుల్ అటెన్షన్ పొందింది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ.. ప్లే ఆఫ్ సినారియో మొత్తం ఆ టీం మీదే ఆధారపడి ఉంది. జైపూర్ వేదికగా ఈ రోజు జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ఐపిఎల్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఆ జట్టుకు మరింత క్లిష్టంగా మారనుంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
- Advertisement -
- Advertisement -