Monday, May 19, 2025
Homeజాతీయంఐఐటీ బాంబే కీల‌క నిర్ణ‌యం..ఆదేశంతో విద్యాసంబంధాలు నిలిపివేత‌

ఐఐటీ బాంబే కీల‌క నిర్ణ‌యం..ఆదేశంతో విద్యాసంబంధాలు నిలిపివేత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆప‌రేష‌న్ సిందూర్ టైంలో పాక్‌కు తుర్కియే, అజ‌ర్ బైజాన్ దేశాలు మ‌ద్ద‌త‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. పాకిస్థాన్‌కు మిల‌ట‌రీ సాయంతో పాటు డ్రోన్లు, మిస్సైల్ స‌ర‌ఫ‌రా చేశాయి. దీంతో ఆగ్ర‌హించిన ఇండియ‌న్స్ ఆ దేశాల‌కు చెందిన ప‌లు ర‌కాల వ‌స్తువుల‌ను బాయ్‌కాట్ చేస్తున్నారు. అంతేకాకుండా జేఎన్ యూ, జామియా, ల‌వ్లీ యూనివ‌ర్సిటీలు టర్కీ దేశాల విద్యాసంస్థ‌ల‌తో తెగ‌తెంపులు చేసుకున్నాయి. తాజాగా ఆ యూనివ‌ర్సిటీల బాట‌లోనే ఐఐటీ బాంబే వెళ్తోంది. టర్కీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేసింది. ‘తుర్కియేకి సంబంధించిన ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా, తదుపరి నోటీసు వచ్చే వరకు టర్కిష్ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను ఐఐటీ బాంబే నిలిపివేస్తోంది’ అని ఎక్స్‌లో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -