నవతెలంగాణ – హైదరాబాద్ : సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో యువ ప్లేయర్లతో పాటు, సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచి ఫామ్ కనబరిచారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో యువ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల సంతృప్తి చెందిన భారత క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. వారు ప్రపంచ కప్ ఆడటంపై రిపోర్టర్ ప్రశ్నించగా.. వారిద్దరి గురించి గంభీర్ మాట్లాతూ .. “వారందరూ అద్భుతమైన ఆటగాళ్లే. అయితే, వచ్చే ప్రపంచకప్‌కు మరో రెండేళ్లు ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆట గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్స్ ఇప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు” అని స్పష్టం చేశారు. వారిద్దరిపై ఇప్పుడు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేనంటూ గంభీర్ పరోక్షంగా వారి సీనియారిటీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని అర్థమవుతోంది. అంటే, రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అనే దానిపై కోచ్‌గా తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని గంభీర్ తేల్చి చెప్పారు.
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు గౌతమ్ గంభీర్ భారీ షాక్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



