గోవిందరావుపేట గ్రామపంచాయతీ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పోరిక కిరణ్ కుమార్
నవతెలంగాణ గోవిందరావుపేట
ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధిని మీ గుమ్మం ముందు ఉంచుతానని బీఆర్ఎస్ పార్టీ గోవిందరావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పోరిక కిరణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కిరణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ గా ఘన విజయం సాధించి ఆదర్శ గ్రామ పంచాయతీగా గోవిందరావు పేట గ్రామాన్ని తీర్చిదిద్దుతానని మాటిస్తునున్నారు. చదువుద్వారా నేను నేర్చుకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు పంచడం కోసం నిరంతరం శ్రమించానని, నా జీవితం తెరిచిన పుస్తకం, నా 20 ఏండ్లు విద్య వృత్తిలో ఏనాడు ఏ ఒక్క వ్యక్తిని కించపరిచి మాట్లాడిన, దుర్బశలు ఆడిన చరిత్ర నాకు లేదు. నా రాజకీయ ప్రవేశం జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు నాపై అవాకులు చెవాకులు పేలుస్తూ, తప్పుడు ఆరోపణలకు దిగడం సమంజసం కాదన్నారు.
చేతనైతే రాజకీయరంగంలో నన్ను ఎదుర్కొని గెలిచినిలవండి కానీ చౌకబారు మాటలతో, దిగజారుడు మానుకోవాలి హితవు పలుకుతున్నను. గ్రామ అభివృద్ధి,బంగారు భవిష్యత్తు కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వాదించగలరని గ్రామ ప్రజలను కోరుతున్నాన్నారు. వేలాదిమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించిన నేను నా గ్రామానికి అభివృద్ధిని సాధించడమే నా ముందు న ఏకైక లక్ష్యమని అన్నారు. నూతనత్వం కోసం మార్పు కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.



