నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Advertisement -