Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంకాశ్మీర్‌లో ఎన్‌ఐఎ మెరుపు దాడులు

కాశ్మీర్‌లో ఎన్‌ఐఎ మెరుపు దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీ పేలుడు కేసుకు సంబంధించి దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని పలు ప్రాంతాల్లో జమ్ముకాశ్మీర్‌ పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ) మంగళవారం సోదాలు చేపట్టింది. అనంతనాగ్‌లోని హుత్మురా అటవీ ప్రాంతంలో ఎన్‌ఐఎ బృందం సోదాలు చేసి, స్కాన్‌ చేస్తోందని ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. అరెస్టయిన వైద్యుడు డా.అదీల్‌ రాథర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచించాయి.

నవంబర్‌ 10న ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు వెనుక అంతర్‌ రాష్ట్ర్ర ఉగ్రవాద కేసులో అరెస్టయిన ఇద్దరు స్థానిక వైద్యుల్లో డా. రాథర్‌ ఒకరు. నవంబర్‌ 7న, అనంతనాగ్‌ మెడికల్‌ కాలేజీలో ఆయన లాకర్‌ నుండి ఎకె-47 రైఫిల్‌ను స్వాదీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఎ ఆరోపించింది. ఆయన ఆ కాలేజీలో 2024 అక్టోబర్‌ వరకు సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయికి వెళ్లిన డా.రాథర్‌ సోదరుడు డా.ముజఫర్‌ రాథర్‌ను కూడా విచారిస్తున్నట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -