- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానయాన సంస్థలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5 శాతం కోత విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 2,200 విమానాలు నడుపుతున్న ఈ సంస్థలో, ఈ కోత నేపథ్యంలో ఒక రోజులో 100కు పైగా విమాన సర్వీసులు తగ్గనున్నాయి.
- Advertisement -



