- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రతిమా బగ్రీ సోదరుడు అనిల్ బగ్రీని గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలపై సత్నా పోలీసులు అరెస్టు చేశారు. పంకజ్ సింగ్ అనే యువకుడి దగ్గర పోలీసులకు గంజాయి దొరికింది. విచారణలో మంత్రి సోదరుడు అనిల్ బగ్రీ, బావ శైలేంద్ర సింగ్ రాజవత్‌లే తనకు అందజేసినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు అనిల్ ను అరెస్ట్ చేయగా శైలేంద్ర సింగ్ పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.9.22 లక్షలు ఉంటుందని అంచనా.
- Advertisement -



