- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి చిత్రపరిశ్రమపై గౌరవం, మమకారం ఉన్నాయని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి ‘మానస పుత్రిక’ను చూడాలని ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు వచ్చినట్లు చెప్పారు. ‘‘హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్‌హబ్‌గా చేయాలని సీఎం రెండేళ్ల క్రితమే చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రపరిశ్రమలు ఇక్కడికి వచ్చేలా కృషి చేద్దామన్నారు. చెప్పిన కొన్ని రోజులకే ఎందరో ప్రముఖులను నగరానికి తీసుకొచ్చారు. ఈ సమిట్‌ను చూసిన అనంతరం ముఖ్యమంత్రి అనున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చింది’’ అని చిరంజీవి అన్నారు.
- Advertisement -



