Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా ప్రభుత్వానికి బలపరచండి 

ప్రజా ప్రభుత్వానికి బలపరచండి 

- Advertisement -

– సంక్షేమం అభివృద్ధిలో తెలంగాణ ముందంజ 
– ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బిఎల్అర్
నవతెలంగాణ – మిర్యాలగూడ 
ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బలపరచాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. గురువారం మండలంలోని జంకు తండ, వెంకటాద్రి పాలెం, శ్రీనివాస్ నగర్, దుబ్బ తండ, సమ్యగాని తండ, టీక్యా తండ, సీత్యా తండ గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, రవీందర్ రెడ్డి, షేక్ జిందా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -