– వ్యవసాయ పనుల్లో పాల్గొన్న అభ్యర్ధి సీత
– ప్రచారంలో మాట్లాడిన జిల్లా నేత అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి మొడియం సీత గురువారం తాటి నాగుల గుంపు లో కూలీల ఓట్లు అభ్యర్ధిస్తూ కొద్ది సేపు వ్యవసాయ పనులు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొగాకు మొక్కలకు ఎరువులు చల్లారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ శ్రమ అంటే ఎమిటో తెలిసిన వ్యక్తి అని,ఇప్పటికే మండలంలో కార్మిక,శ్రామికుల సమస్యల పై సమరశీల పోరాటాలు నిర్వహించడంలో సీత అగ్ర భాగాన ఉందన్నారు. గ్రామ సమస్యలు తెలిసిన మనిషి, నిస్వార్ధ సేవ చేసే సీత ను గెలిపించుకుంటే మల్లాయిగూడెం అభివృద్ధితో పాటు మచ్చ లేని పరిపాలన సాద్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,పార్టీ మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, దుర్గ రావు, తిరుపతమ్మ, లక్ష్మణ రావు, రాము,బాబురావు తదితరులు పాల్గొన్నారు.
సాగు క్షేత్రాల్లో సీపీఐ(ఎం) ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



