– మేడిపల్లిలో బరితెగించిన కబ్జా దారులు
– గుడిసెల వెనుక ఉన్న హస్తం నేత ఎవరు?
– గుడిసెలు తొలగించిన రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-బోడుప్పల్: 2018 లో కుల సంఘాలకు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలను కేటాయించింది. అందులో భాగంగానే మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని మేడిపల్లి రెవెన్యూ 103 సర్వే నెంబరు లో రజక ఆత్మగౌరవ భవనం కోసం 2.20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. అప్పటి నుండి అ స్థలం ప్రభుత్వ అధీనంలోనే ఉంది.కానీ సదరు స్థలంపై కన్నేసిన కొందరు స్థానిక రాజకీయ నాయకులు సదరు సర్వే నెంబర్ లో కొన్ని తప్పుడు పత్రాలతో నకిలీ పట్టాలు సృష్టించి పేదలకు అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు.
ప్రభుత్వం మారడంతో….2023 కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కబ్జా చేసిన ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకోవాలని చూసిన అ కబ్జా దారుడి పాచికలు పారలేదు.దాంతో రాష్ట్రంలో అధికార మార్పిడి కాగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన సదరు ఖద్దరు నేత అవే పాత పట్టాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతల ఇండ్ల ముందు రోజు ప్రదక్షిణలు చేయాడం మొదలు పెట్టారు. అసలే పట్టాకు ఇంతా అని వసూళ్లు చేసే డబ్బులు ఇచ్చిన వాళ్ళు వత్తిడిలు పెట్టడంతో కొత్త నాటకానికి తేరలేపాడూ….స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేరిటా కాలనీ బోర్డు ఏర్పాటు చేస్తే అధికార పార్టీ నేతలు, అధికారులు ఎవరు సప్పుడు చేయారు అనుకున్నాడో ఎమో ఏకంగా కబ్జా చేసిన స్థలానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాలనీ పేరుతో రాత్రికి రాత్రే బోర్డు ఏర్పాటు చేసి గుడిసెలు వేయించాడు.
రజకులకు కేటాయించిన భూమి కాపాడేది ఎవరూ…
రజక ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన స్థలంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు ( ఎన్నికల అనంతరం తన స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారాడు) ఇలా ముఖ్యమంత్రి పేరుతో కబ్జా చేస్తుంటే మరీ అత్యంత వెనుకబడిన కులమైన రజకులకు న్యాయం చేసేది ఎవరు అనేది పశ్నర్దకంగా మారింది… అధికార పార్టీ నాయకులు స్పందించి సదరు నేతపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.


