Friday, December 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఒడిశా బార్‌లో భారీ అగ్నిప్రమాదం..

ఒడిశా బార్‌లో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గోవా నైట్‌క్లబ్ విషాదం మరవకముందే ఒడిశాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని భువనేశ్వర్‌లోని ఓ బార్‌లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటల తీవ్రత పెరిగి.. ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

నగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న సత్యవిహార్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు సమీప భవనాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -