- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్‌ఎంఎస్ విభాగంలోని టర్బో ల్యాడిల్ కార్ (టీఎల్‌సీ) ద్వారా తెచ్చిన ద్రవ ఉక్కును డంపింగ్‌యార్డ్‌లో డంప్ చేశారు. ఈక్రమంలో అక్కడ ఉన్న ఎండిన గడ్డి, చెత్తకు అది అంటుకొని మంటలు చెలరేగాయి. పొగ రావడంతో గమనించిన ఉద్యోగులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
- Advertisement -



