– కీలకమైన లోహాలు, ఖనిజాల ఎగుమతులను నిలిపివేసిన చైనా
బీజింగ్: అమెరికాతో టారిఫ్‌ల యుద్ధం సాగుతున్న వేళ…కీలకమైన లోహాల, ఖనిజాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఎగుమతులకు సంబంధించి నూతన నియమ నిబంధనలతో కూడిన ఒక వ్యవస్థను చైనా ప్రభుత్వం రూపొందిస్తోంది. అప్పటివరకు కార్ల నుంచి క్షిపణుల వరకు దాదాపు ప్రతీ వస్తువు తయారీలో కీలకమైన అయస్కాంతాల రవాణాను చాలా ఓడరేవుల్లో నిలిపివేసింది. కీలకమైన పలు ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాల ఎగుమతులను స్తంభింపచేస్తూ చైనా చర్యలు తీసుకుంది. అంతేకాదు ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటో తయారీలు, ఏరో స్పేస్ తయారీదారులకు, సెమీ కండక్టర్ కంపెనీలకు అవసరమైన విడిభాగాల సరఫరాలను పశ్చిమ దేశాలకు ఆపివేస్తామని, విస్తృత శ్రేణిలో వినిమయ వస్తువుల సరఫరాలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఒకసారి గనుక ఈ నిబంధనావళి అమల్లోకి వస్తే, అమెరికన్ మిలటరీ కాంట్రాక్టర్లతో పాటూ నిర్దిష్ట కంపెనీలకు సరఫరాలు చేరకుండా శాశ్వతంగా నిరోధించబడతాయని ఆ కథనం పేర్కొంది.
చైనా దిగుమతులపై ఆధారపడిన అమెరికా
వాణిజ్య యుద్ధానికి తెర తీసిన ట్రంప్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇలా ఎగుమతులపై కొరడాను చైనా ఝళిపించింది. ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాల్లో దాదాపు 90శాతం చైనానే తయారుచేస్తుంది. వీటిలో 17 మూలకాలను రక్షణ, ఎలక్ట్రిక్ వెహికల్, ఇంధన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వాడతారు. మధ్య తరహా, భారీ అరుదైన ఖనిజాల్లో ఏడు కేటగిరీలను ఎగుమతుల నియంత్రణా జాబితాలో వుంచారు. అమెరికాలో ఒకే ఒక అరుదైన ఖనిజాల గని వుంది. మిగిలిన ఉత్పత్తుల్లో చాలా భాగం చైనా నుంచి రావాల్సిందే. చైనా ఉత్పత్తులపై 54శాతం టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా చైనా చేపట్టిన చర్యల్లో భాగంగా ఏప్రిల్ 2న అత్యంత అరుదైన భూ ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. భూగర్భం నుంచి వెలికి తీసిన ఖనిజాలపైనే కాకుండా శాశ్వత అయస్కాంతాలు, మార్చడానికి వీల్లేనటు వంటి ఇతర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. ఇటు వంటి చర్యలు వుంటాయని బీజింగ్ చాలా ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తోంది. తాజాగా తీసుకున్న చర్యలతో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దశాబ్దాలుగా చైనాపై ఆధారపడుతూ వచ్చిన కీలకమైన ఖనిజాలు, ఇతర సరఫరాలు నిలిచిపోవడంతో అమెరికన్ తయారీ రంగం అల్లకల్లోలమవుతుంది. ఇప్పుడు లోహాలు, వాటితో తయారయ్యే ప్రత్యేక అయస్కాంతాలు ప్రత్యేక ఎగుమతి లైసెన్సుల ద్వారా మాత్రమే చైనా నుంచి రవాణా అవుతాయని న్యూయార్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే, ఈ లైసెన్సులు జారీ చేసే వ్యవస్థ ప్రస్తుతం చైనాలో సమగ్రంగా లేదు. దీనివల్ల మొత్తంగా ఈ ప్రక్రియ అమలు ఆలస్యం కావచ్చునని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. చైనా వెలుపల ఖనిజాలు, ఉత్పత్తుల సరఫరా బాగా తక్కు వగా వుంటుందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల కేవలం అమెరికానే కాదు, దాదాపు అన్ని దేశాల ఎగుమతులు ప్రభావితమవుతాయి. మైనింగ్, కీలకమైన ఖనిజాల ప్రాసెసింగ్ రంగంలో తన ఆధిపత్యాన్ని చైనా ఒక ఆయుధంగా ఎలా మార్చుకుంటోందో ఈ చర్యతో స్పష్టమవుతోంది. ఈ ఎగుమతుల కంట్రోళ్ళు పూర్తి నిషేధాన్ని అమలు చేయకపోయినా పలు ఎగుమతుల లైసెన్సులను నియంత్రించడం ద్వారా రవాణాను అడ్డుకుం టాయి. తమ ఉత్పత్తుల్లో చైనా ఖనిజాలు, లోహాలను ఉపయోగించే అమెరి కన్ కంపెనీల్లో లాక్‌హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి సంస్థలు వున్నాయి. ప్రస్తుతం కొన్ని ఖనిజ నిల్వలు అమెరికా వద్ద వున్నప్పటికీ రక్షణ కాంట్రాక్టర్లకు సుదీర్ఘకాలం పూర్తిగా సరిపడా వుండవు. ఇప్పటికే అమెరికాకు మూడు లోహాల ఎగుమతులపై బీజింగ్ నిషేధం విధించింది. పలు ఇతర ఉత్పత్తులపై నియంత్రణలు అమలు చేస్తోంది. చైనాకు వెలుపల అత్యంత అరుదైన భూ ఖనిజాల ఆపరేషన్ జరిగేది మయన్మార్, లావోస్‌ల్లోనే. అయితే ఆ రెండు ప్రాంతాల నుండి వచ్చే సరఫఱాల్లో కూడా చైనా ప్రమేయముం టుందని కన్సల్టెన్సీ ప్రాజెక్టు బ్లూకి చెందిన డేవిడ్ మెర్రీమాన్ వ్యాఖ్యానించారు.
అమెరికాకు ఎందుకింత కీలకం
ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబొట్లు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, గాసోలిన్‌తో నడిచే కార్లు తయారీలో ఈ అరుదైన లోహాలు చాలా కీలకమైనవి. అలాగే జెట్ ఇంజన్లు, లేజర్లు, కార్ హెడ్‌లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్‌లు, కేపాసిటర్లు తయారీలో కూడా ఈ లోహాలు అవసరమవుతాయి.
అమెరికాకు షాక్
- Advertisement -
RELATED ARTICLES