- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్ లో తెల్లవారుజామును భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి సమాచారం అందలేదు. గడిచిన నాలుగు రోజుల్లో ఆదేశంలో భూకంపం రావడం ఇది నాలుగో సారి అని NCS అధికారులు చెప్పారు. హిందూకుస్ పర్వతాల్లో నిరంతర కదిలికల వల్ల..తరుచుగా ఆఫ్ఘన్ లో అధికంగా ప్రభావితమువుతుందని తెలిపారు. గతంలో పలు భూప్రకంపనలు వచ్చాయని పేర్కొన్నారు.
- Advertisement -