నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాకు చెందిన యస్. సి,యస్.టి, బి.సి, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థిని/విద్యార్థులకు 2025-2026 విద్యా సంవత్సరమునకు గాను కార్పోరేట్ (ఇంటర్) కళాశాలలో ప్రవేశం పొందుటకు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ వసతి గృహములలో చదివి 10 వ వార్షిక పరీక్షలలో 7.0 (జి.పి.ఎ)/400 మార్కులు , ఆ పైన ఉత్తీర్ణులైన యస్.సి/యస్.టి/ఓ.బి.సి / మైనారిటీ విద్యార్థుల నుండి ఆన్ లైన్ ద్వారా తేది:17.05.2025 నుండి 31.05.2025 వరకు ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డు కులముల అభివృద్ది శాఖ అధికారి కార్యాలయం నుండి సోమవారం ప్రకటన విడుదల చేశారు. 10 వ తరగతి మెరిట్ ఆధారముగా మాత్రమే (సిజిజి ఆన్లైన్ ఆటోమెటిక్ సిస్టం) ద్వారా ఎంపిక చేసి ప్రవేశము కల్పించబడుతుంది అని తెలియజేశారు. www.telanganaepass.cgg.gov.in ఆన్ లైన్ వెబ్ సైట్లో ధరఖాస్తు చేసుకోవలసినదిగా జిల్లా షెడ్యూల్డు కులముల అభివృద్ధి అధికారిని తెలియజేశారు.
కార్పోరేట్ కళాశాలల్లో 2025- 2026 విద్యా సంవత్సరమునకు ప్రవేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES