Monday, May 19, 2025
Homeజాతీయంక‌ర్నాట‌క‌లో భారీ వ‌ర్షాలు..నీట‌మునిగిన కాల‌నీలు

క‌ర్నాట‌క‌లో భారీ వ‌ర్షాలు..నీట‌మునిగిన కాల‌నీలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలు కర్ణాటకను ముంచేశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.బెంగళూరు మహానగరం వరదతో నీట మునిగిపోయింది.సోమవారం తెల్లవారు జామున బెంగళూరులో ప్రయాణికులకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు స్వాగతం పలికాయి. నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హోరామావులోని శ్రీ సాయి లేఅవుట్, రెయిన్‌బో డ్రైవ్ వంటి లేఅవుట్‌లు వరదల్లో చిక్కుకున్నాయి. సాయి లేఅవుట్ వద్ద ఇళ్లలోని నీటిని తొలగించడానికి నివాసితులు ఇబ్బంది పడుతున్నారు. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డ్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. అప్ర‌మ‌త్త‌మైన ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సాయ‌క చ‌ర్య‌లు చేపట్టింది. నీటి మునిగిపోయిన ప్రాంతాల్లో ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -