- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు యూకో బ్యాంక్ మాజీ చైర్మన్, ఎండీ సుబోధ్ కుమార్ గోయల్ ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే రూ.వెయ్యి400 కోట్ల బ్యాంకు రుణ కుంభకోణానికి సంబంధించి కాన్‌కాస్ట్ గ్రూప్ చైర్మన్ సంజయ్ సురేకాతో పాటు సుబోధ్ కుమార్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కలకత్తా ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారని వెల్లడైంది. కేసులో మిగిలిన వ్యక్తుల పాత్ర గురించి తెలుసుకునేందుకు గోయల్ ను ఈడీ అధికారులు కస్టడీలో విచారించనున్నారని వెల్లడైంది.
- Advertisement -