- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూచౌక్ సెంటర్‌లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణాల్లో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో జూనియర్ కళాశాల, ఎస్‌బీఐ శాఖ ఉన్నాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. తొలుత సెల్‌ఫోన్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగినట్లు.. దాని నుంచి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
- Advertisement -



