- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మలయాళ నటుడు అఖిల్ విశ్వనాథ్(30) మృతి చెందారు. తల్లి చూసేసరికి అఖిల్ ఇంట్లో శవమై కనిపించారు. అతను ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలున్నాయి. అఖిల్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘చోలా’ చిత్రానికి 2019లో కేరళ స్టేట్ అవార్డ్ లభించింది. అతను మొబైల్ షాపులో మెకానిక్‌గా చేస్తున్నారని, కొన్నాళ్లుగా ఆ పనికీ వెళ్లట్లేదని తెలుస్తోంది. బైక్ ప్రమాదంలో గాయపడిన అఖిల్ తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -



