Tuesday, May 20, 2025
Homeఅంతర్జాతీయంపాలస్తీనియన్లకు పరిమిత ఆహారానికి కేబినెట్‌ ఆమోదం : నెతన్యాహు

పాలస్తీనియన్లకు పరిమిత ఆహారానికి కేబినెట్‌ ఆమోదం : నెతన్యాహు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇజ్రాయిల్‌ గాజాపై వరుస దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల వల్ల వేలాది మంది పాలస్తీనియన్లు చనిపోగా.. మరికొంతమంది ఆకలితో మృతి చెందారు. ఇదిలా ఉండగా.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నప్పటికీ గాజాలోని పాలస్తీనియన్లకు ఆహార సరఫరాను సైతం ఇజ్రాయిల్‌ నిలిపివేసింది. అయితే తాజాగా ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు (ఐడిఎఫ్‌) సిఫార్సుల మేరకు పరిమిత ఆహారాన్ని పాలస్తీనియన్లకు సరఫరా చేసేందుకు తన కేబినెట్‌ ఆమోదించినట్లు ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు చెప్పారని సోమవారం యూరోన్యూస్‌ నివేదించింది. ఇటీవల ఇజ్రాయిల్‌ పాల్పడిన భూ ఉపరితల దాడుల వల్ల వందమందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ దాడుల తర్వాతనే నెతన్యాహు పాలస్తీనియన్లకు ఆహారాన్ని సరఫరా చేయడానికి ఆమోదించినట్లు యూరో న్యూస్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -