- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రెండో విడత పోలింగ్‌లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఐ(ఎం) ఓ గ్రామ సర్పంచ్ పదవీని కైవసం చేసుకుంది. గోపసముద్రంలో CPI(M) బలపరిచిన సరస్వతి రవి నాయక్ సర్పంచ్ గా గెలుపొందారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రజా సమస్యలపై పోరాటమే ఈ విజయంలో కీలకంగా నిలిచిందని నాయకులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని సరస్వతి రవి నాయక్ పేర్కొన్నారు. ఈ ఫలితాలతో గ్రామంలో CPI(M)తన ప్రాబల్యాన్ని చాటింది.
- Advertisement -



