నవతెలంగాణ-దుబ్బాక: ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల మిత్ర బృందం..బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్థిక చేయూతను అందిస్తుంది. దుబ్బాక మున్సిపల్ పరిధి లచ్చపేట లోని జెడ్ పీహెచ్ఎస్ లో చదువుకున్న 1979- 80, 80- 81, 82- 83 బ్యాచుల పూర్వ విద్యార్థులు సుమారు 50 మందితో కలిసి ఓ వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. పలు సమస్యలతో సతమవుతున్న పలు కుటుంబాలక, అకాల మరణంతో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తోచినంతగా ఆర్థిక చేయూతను అందిస్తు ఆ పూర్వ విద్యార్థుల మిత్ర బృందం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. లచ్చపేట 11 వ వార్డుకు చెందిన మలిపెద్ది రమేష్ కొద్ది నెల్ల క్రితం అనారోగ్యంతో మరణించగా..రమేష్ తల్లి మలిపెద్ది రాజవ్వ కు రూ.35,000, భార్య విజయకు రూ.21,116 ల నగదును ఆర్థిక చేయూతగా సోమవారం అందించారు. ఈ సందర్భంగా వారు వై.శ్రీనివాస్, నందాల శ్రీకాంత్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మిత్ర బృందం సభ్యులు ఉస్మాన్, శ్రీరాములు, నాగేందర్, ఎస్.సుధాకర్, షాదుల్, డీ.శ్రీనివాస్, ఎస్.రఘునాథ్ ఉన్నారు.
బాధిత కుటుంబాలకు పూర్వ విద్యార్థుల ఆపన్నహస్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES