– జన్నారంలో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి…
నవతెలంగాణ – జన్నారం
పుచ్చలపల్లి సుందరయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల నాయకులు కూకటికారి బుచ్చయ్య సిఐటియు మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ అన్నారు. సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా మండలంలోని రామ్ నగర్ కాలనీలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానేత అన్నారు. ఆయన గొప్ప స్వతంత్ర సమరయోధుడు అన్నారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం చేసిన మహా నేత అన్నారు. యువకులు అతని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం కోసం రాష్ట్రం కోసం అతను చేసిన సేవలు ఎనలేని అన్నారు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య జీవితం పేదల కోసం సమ సమాజం కోసం త్యాగం చేశాడన్నారు. అతని ఆశయ సాధన కోసం ప్రతి కమ్యూనిస్టు కృషి చేయాలన్నారు. 17 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు కొండ గొర్ల లింగన్న రాజన్న, ఐద్వా మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ, గంగన్న మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
పుచ్చలపల్లి సుందరయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES