Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్నేటి నుంచి 24 వరకు ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు

నేటి నుంచి 24 వరకు ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఎడ్యుకేషన్ కార్యదర్శి, జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు నేడు మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలోని పిఎస్,యూపీఎస్,ఎస్జిటి,ఎల్ఏప్ఎల్ ప్రాదానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మండల స్థాయిలో శిక్షణ తరగతులు 20 నుంచి 24 వరకు మండలంలోని వళ్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.కావున మండలంలోని 4-ఎల్ఏప్ఎల్ ప్రాదానోపాధ్యాయులు,53-ఎస్జిటీలు,2-2008 కాంట్రాక్టు టీచర్స్ సకాలంలో తప్పకుండా హాజరై శిక్షణ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -