- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ చిన్న ప్రయివేటు విమానం అత్యవసరంగా ల్యాండ్ చేస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
మెక్సికో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలుకా విమానాశ్రయానికి ఐదుకిలోమీటర్లు దూరంగా ఉన్న శాన్ మాటియో అటెన్కోలో ఈ ఘటన జరిగింది. అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా.. ఇద్దరు సిబ్బంది ఉన్నారు. సాకర్ మైదానంలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- Advertisement -



