- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.
- Advertisement -



