Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆటలుఅభిజ్ఞాన్‌ కుందు డ‌బుల్ సెంచరీ..భార‌త్ భారీ స్కోర్

అభిజ్ఞాన్‌ కుందు డ‌బుల్ సెంచరీ..భార‌త్ భారీ స్కోర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అండర్‌-19 ఆసియా కప్‌ 2025లో భాగంగా దుబాయ్‌ వేదికగా టీమ్‌ఇండియా, మలేషియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్ అభిజ్ఞాన్ డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌తో డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. దీంతో భార‌త్ భారీ స్కోరు చేసింది. 50 ఓవ‌ర్ల‌కు ఏడు వికెట్లు కోల్పోయి 408 ప‌రుగులు చేసింది. దీంతో మ‌సేషియా జ‌ట్ట‌కు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్‌ గెలిచిన మలేషియా జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. అభిజ్ఞాన్‌ కుందు సెంచరీతో (209*; 125 బంతుల్లో, 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) సంచ‌ల‌నం సృష్టించాడు. వేదాంత్ త్రివేది తృటిలో సెంచరీ (90; 106 బంతుల్లో; 7 ఫోర్లు) మిస్‌ చేసుకున్నాడు. ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (50;26 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి వేగంగా పరుగులు రాబట్టాడు. కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (14), విహాన్‌ మల్హోత్రా (7) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. మలేషియా బౌలర్లలో మహ్మద్‌ అక్రమ్ 5, ఎన్‌.సత్నకుమారన్‌, జాశ్విన్ కృష్ణమూర్తి తలో వికెట్‌ తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -