Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి
 తుర్కపల్లి మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో పుచ్చలపల్లి సుందరయ్య 40 వ వర్ధంతి సందర్భంగా పూల మాలలు వేసి నీవాళ్లు అర్పించారు.  ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ…కమ్యూనిస్టు నాయకుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు స్వతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు గాంధీగా పేరుందిన సుందరయ్య కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు 1913 మే 1న కృష్ణాజిల్లా కొవ్వూరు తాలూకా అలాగానిపాడులో జన్మించారు ఆయన పశ్చిమగోదావరి లో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు రష్యా రోమ్ యునైటెడ్ కింగ్డమ్ కైరో తదితర దేశాలను సందర్శించాడు 1946లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రచించాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించి కుల వ్యవస్థను నిర్మూలించాలని ఉద్యమాన్ని నడిపినాడు పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి లోని రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నాడు ఆయన పార్లమెంటులో సుదీర్ఘ కాలం పాటు పనిచేశాడు ఆ సమయంలో పార్లమెంటుకు సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్లేవాడు పని వాళ్ళ సైకిల్లా స్టాండ్ లోనే ఈయన సైకిల్ ని స్టాండ్ చేసేవాడు కామ్రేడ్ లీలావతిని పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు బంధువయాలు అడ్డుపడతాయని పెళ్లి కాగానే కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్న గొప్ప మహోన్నతమైన వ్యక్తి తండ్రి నుంచి వచ్చిన వంశపార్యం పరంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచి వేశాడు 1985 మే 19న మద్రాసులో పుచ్చలపల్లి సుందరయ్య అమరుడయ్యాడు అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య పార్టీ మండల కమిటీ సభ్యులు గడ్డమీది నరసింహ తూటి వెంకటేశం జేరిపోతుల కర్ణాకర్ ఆవుల కళమ్మ సిఐటియు నాయకులు కట్కూరు వెంకటేష్ శ్రీపతి ఆంజనేయులు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad