Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంజస్టిస్‌ యశ్వంత్‌ వర్మ పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేయడానికి కమిటీ నియామకాన్ని సవాలు చేస్తూ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు మంగళవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. జడ్జీల (విచారణ) చట్టం ప్రకారం.. లోక్‌సభ మాత్రమే నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ చట్టబద్ధతను సవాలు చేసిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. జడ్జీల (విచారణ) చట్టం, 1968లోని సెక్షన్‌ 3(2)కింద కమిటీని నియమించడంలో గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్‌ 2025 ఆగస్ట్‌ 12 నాటి అభ్యంతరకరమైన చర్య రాజ్యాంగ విరుద్ధమని, భారత రాజ్యాంగం, 1950లోని ఆర్టికల్స్‌ 124,217 మరియు 218లను ఉల్లంఘిస్తోందని, జడ్జీల విచారణ చట్టం, 1968 ప్రకారం చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానానికి విరుద్ధమని పేర్కొంటూ.. వాటిని పక్కన పెట్టేలా తగిన రిట్‌, ఆర్డర్‌ లేదా ఆదేశాలను జారీ చేయాలని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ పిటిషన్‌లో పేర్కొన్నారు.

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తొలగింపుకు సంబంధించి పార్లమెంట్‌ ఉభయ సభలలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, దీంతో ఆయనపై విచారణ కమిటీని లోక్‌సభ మరియు రాజ్యసభ రెండూ సంయుక్తంగా ఏర్పాటు చేయాల్సి వుందని, లోక్‌సభ స్పీకర్‌ ఏకపక్షంగా ఏర్పాటు చేయకూడదని ఆయన తరపున న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు.

లోక్‌సభ నియమించిన విచారణ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్‌ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.వి. ఆచార్యలతో లోక్‌సభ విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీపై స్పందన తెలియజేయాల్సిందిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం లోక్‌సభ స్పీకర్‌ కార్యాలాయానికి, ఉభయ సభల సెక్రటరీ జనరల్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చేఏడాది జనవరి 7కి వాయిదా వేసింది.

మార్చి 14న ఢిల్లీలోని జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుట్టలుగా నగదు కట్టలు బయపడిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -