Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఉండేలా చూడాలి

కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఉండేలా చూడాలి

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం భీంగల్ పురపాలక కార్యాలయం నందు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన హౌసింగ్ ఏఈ తో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గురించి ప్రభుత్వ మార్గదర్శకాలు వివరించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని, ప్రభుత్వం తెలిపిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు వివరించాలని కమిటీ సభ్యులకు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు. పట్టణంలోని వార్డు నెంబర్ 1 లో అలాగే వివిధ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులకు ఈరోజు ముగ్గు పోయడం భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిఖిల్, హౌసింగ్ ఇంజనీర్ మున్సిపల్ మేనేజర్ నరేందర్. వార్డ్ ఆఫీసర్లు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -