Wednesday, December 17, 2025
E-PAPER
Homeకరీంనగర్మూడో ఫేజ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

మూడో ఫేజ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో మూడో  ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు.

ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో ఈ నెల 17 న బుధవారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 80, వార్డుల్లో 551 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలకు నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1,244 మంది విధులు నిర్వర్తించనున్నారని,  క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందనీ, ఎఫ్ ఎస్ టీ, ఎస్ ఎస్ టీ టీంలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ ఈ సీ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంక ఇతర సామగ్రి సరి చూసుకోవాలని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -